మోడల్ హాస్టల్ వర్కర్స్ పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ సీఐటీయు నాయకుల ఆధ్వర్యంలో సోమవారం కొమరంభీం జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దౌత్రెకు వినతిపత్రం ఇచ్చారు. జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ.. గత 3నెలల నుండి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. మోడల్ హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పార్వతి రేఖ కవిత మంజుల సుమలత తదితరులు పాల్గొన్నారు.