రెండు లారీలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

79చూసినవారు
రెండు లారీలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం దేవులగూడా సమీపంలో గురువారం రెండు లారీలు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆసిఫాబాద్ వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వెనుకాల ఢీకొన్న లారీ పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో హోటల్లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్