వాంకిడి మండల కేంద్రంలోని కొమురం భీం విగ్రహం వద్ద శుక్రవారం ఆదివాసి గిరిజన సంఘ నాయకుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఆదివాసి రాబోయే నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి రంగంలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిమ గిరిజన జిల్లా ప్రధాన కార్యదర్శి కోర్వేత మనోహర్, కొట్నాక వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.