హత్తిని గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి: డివైఎఫ్ఐ

82చూసినవారు
హత్తిని గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి: డివైఎఫ్ఐ
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం హత్తిని గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డివైఎఫ్ఐ జిల్లా నాయకురాలు కుందరం మంజుల శుక్రవారం అన్నారు. రోడ్డుపై నీటి గుంతలను పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మురికి కాలువలు నిర్మించాలని అన్నారు. ఇట్టి సమస్యపై గ్రామపంచాయతీ సిబ్బంది కార్యదర్శి స్పందించి రోడ్డుపైన గుంతలను పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ కోరడమైనది.

సంబంధిత పోస్ట్