ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కడంబా గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం బోలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో బోలెరో డ్రైవర్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.