కాగజ్నగర్ లోని వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సోమవారం కాగజ్నగర్ టౌన్ సిఐ శంకరయ్య పర్యవేక్షించారు. ఇందులో భాగంగా మేయిన్ మార్కెట్ లో శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో కొలువుదీరిన అయోధ్య బాలరాముని రూపంలో ఉన్న గణనాథున్ని దర్శించుకుని కమిటీ వారికి పలు సూచనలు చేశారు. ప్రతీ మండలి వారు తప్పకుండా ఆన్ లైన్ చేసుకోవాలని అన్నారు. రాత్రి వేళలలఇద్దరు ఉండేలా చూడాలని సూచించారు.