గర్భం ధరించొద్దని భావించేవారికి లూప్ మంచి సాధనం. దీని ప్రధానమైన పని అండం, వీర్యం కలవకుండా చేయటం. ఇలా ఫలదీకరణ జరక్కుండా, గర్భం ధరించకుండా కాపాడుతుంది. ఆంగ్ల అక్షరం ‘టి’ ఆకారంలో ఉండే ఇది చాలా చిన్న పరికరం. ప్లాస్టిక్‌తో తయారయ్యే దీనికి పల్చటి రాగితీగ చుట్టి ఉంటుంది. శృంగార జీవితానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. లూప్‌ను ప్రతి ఐదేళ్లకు ఒకసారి మార్పించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు గర్భం ధరించాలని అనుకుంటే డాక్టర్‌తోనే లూప్‌ను తీయించుకోవాలి.