గర్భ నిరోధక సాధనాలు గడువు తేదీ ముగిశాక తొలగించుకోవాలి. గడువు తీరాక వీటిని తొలగించుకోకపోతే గర్భాశయంలో ఇన్ఫెక్షన్, వాపు వంటి సమస్యలకు కారణమవుతుంటాయి. నెలసరి పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయట. అధిక రక్తస్రావంతో పాటు నెలసరి నొప్పులూ తీవ్రంగా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఈ సాధనాల్ని తొలగించుకున్నాక డాక్టర్ సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో చెకప్స్ చేయించుకోవడమూ ముఖ్యమే!. అమర్చుకున్నాక.. బ్లీడింగ్, కలయిక సమయంలో నొప్పి, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలి.