నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య సెప్టెంబరు 15న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 2 నగరాల మధ్య 578కి. మీ దూరాన్ని ఈ రైలు 7. 15 గంటల్లోనే చేరనుంది. నాగ్‌పూర్‌లో ఉ. 5 గం. కు బయల్దేరి మ. 12. 15 గం. కు సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మ. 1. గం. కు సికింద్రాబాద్‌లో బయల్దేరి రా. 8. 20 గం. కు నాగ్‌పూర్ చేరుకోనుంది. కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతుంది.