'పుష్ప-2' ఈవెంట్.. చెప్పులు విసిరిన ప్రేక్షకులపై లాఠీఛార్జ్
పాట్నాలోని గాంధీ స్టేడియంలో జరుగుతోన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2' ట్రైలర్ ఈవెంట్ కు లక్షల మంది తరలివచ్చిన విషయం తెలిసిందే. అయితే వీరిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ట్రైలర్ విడుదలకు ముందుకొచ్చి పోలీసులపైకి చెప్పులు విసిరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. ప్రేక్షకులపై లాఠీఛార్జ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.