అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలు తరగతిగదులు, వంటశాలను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఉత్తమ ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు.