జాతీయ డెంగ్యూ నిర్మూలన దినోత్సవం మే 16 ను పురస్కరించుకొని మంగళవారం చండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి, మండలాల్లోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగ్యూ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీలు, మానవహారాలు, నిర్వహించారు. చండ్రుగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారిని డాక్టర్ కనకం తనూజా, ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ. డెంగ్యూ కారణాలు డెంగ్యూ వ్యాధి డెంగ్యూ వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ఈడిస్ ఈజిప్ట్ దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతున్నారు. డెంగ్యూ సోకిన డెంగ్యూ సోకిన వ్యక్తుల లక్షణాలు తేలికపాటి లేదా తీవ్రంగా జ్వరం, వాంతులు, కడుపునొప్పి, వికారం, ఒళ్ళు నొప్పులు, దద్దుర్లు, ఉంటాయన్నారు. డెంగ్యూ సోకిన వ్యక్తులు వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలన్నారు.
పుష్కలంగా ద్రవాలు త్రాగాలి జ్వరాన్ని నియంత్రించడానికి ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి పారాసెటమాల్ ట్యాబ్లెట్లు తీసుకోవాలన్నారు. తమ ఇంటి పరిసరాలలో మురుగనీరు నిలవ లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచటం వల్ల దోమల వృద్ది అరికట్టవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు మండలాల స్టాఫ్ నర్సులు శంకరమ్మ, అనితా, నాగమణి, హెల్త్ సూపర్వైజర్లు ఇమామ్, నాగేశ్వరరావు, ఫార్మా సిస్టర్ లక్ష్మి, ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్లు శ్రీనివాస్, కోటి, రాందాస్, ఎల్ టిలు కిరణ్, కిరణ్, ఏఎన్ఎంలు, ఆశాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.