కోటి 95 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

552చూసినవారు
కోటి 95 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి కోటి 95 లక్షల విలువచేసే అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గురువారం అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని రంగాపురం, భీమునిగూడెం, బూరుగూడెం, శాంతినగర్, ఎర్రగుంట, హరిజన కాలనీ, కట్టుగూడెం, అబ్బుగూడెం, మర్రిగూడెం, గ్రామాల్లో నూతనంగా వేసిన సీసీ రోడ్లను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. అలాగే గ్రామాల్లో విస్తృతంగా తిరిగి ప్రజల నుంచి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. వెంటనే పలు శాఖల అధికారులకు ఫోన్ చేసి సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. వెంటనే స్పందించి అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్న శాసనసభ్యులను గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో కులం మతం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. కేవలం అశ్వరావుపేట నియోజకవర్గానికి సిసి రోడ్లు మౌలిక వసతుల కోసం 40 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణ పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనుల కోసం అధిక నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కలిసి ఉన్నప్పుడు జరగని అభివృద్ధి కేవలం 9 సంవత్సరాల్లో నే చేసి చూపించడం జరిగిందన్నారు. దేశం మొత్తం తెలంగాణలో జరిగిన అభివృద్ధి వైపు చూస్తున్నారని అన్నారు. మరో మారు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించి తెలంగాణలో మూడోసారి కూడా అధికారంలో వచ్చేలా ప్రజలందరూ దీవించాలని కోరారు. అనంతరం మండలంలో పలు సమస్యలతో బాధపడుతున్న వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సున్నం లలిత, జడ్పిటిసి భారత లావణ్య రామ్, వైస్ ఎంపీపీ రామారావు, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్, ఉపాధ్యక్షులు కొత్తూరు వెంకటేశ్వర్లు, చిన్న లక్ష్మణరావు, భరత్ రాంబాబు, తహశీల్దార్ భద్రకాళి, ఎంపీడీవో అన్నపూర్ణ, సబ్ ఇన్స్ స్పెక్టర్ సయ్యద్ షాహినా, మండల వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, సిడిపిఓ నిర్మల జ్యోతి, సూపర్వైజర్లు అరుణ, గంగాజలం, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్