తీవ్ర ఉష్ణోగ్రత వడగాడ్పులతో సతమతమవుతున్న మండల ప్రజలకు అకాల వర్షంతో కొంతమేర ఉపశమనం పొందారు. గురువారం సాయంత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా గాలి దుమారంతో కూడిన అకాల వర్షం కురవడంతో అప్పటివరకు ఉక్కపోతను అనుభవించిన మండల ప్రజలు ఒక్కసారిగా చల్లటి వాతావరణం ఏర్పడటంతో కొంత మేర ఉపశమనం పొందారు.
ఇదిలా ఉంటే రైతుల ఆరబోసిన ధాన్యం రాసులు అకాల వర్షానికి తడిసి ముద్దయింది. ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారానికి ధాన్యంపై కప్పిన పట్టాలు పరదాలు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. దామరచర్ల గ్రామానికి చెందిన కౌలు రైతు అచ్చెన వెంకటేశ్వర్లు వరి పొలంలో ఎండబోసిన ధాన్యం తడిసిపోయింది దీంతో కౌలు దీంతో రైతు ఆందోళన చెందుతున్నాడు.
రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి సిపిఐ మండల కార్యదర్శి బొర్రా కేశవరావు డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే దుస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం తేమశాతం పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.