పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల్లో పరిజ్ఞానం పెరుగుతుంది: జిల్లా సెక్టోరియల్ అధికారి

283చూసినవారు
పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల్లో పరిజ్ఞానం పెరుగుతుంది: జిల్లా సెక్టోరియల్ అధికారి
విద్యార్థులు పుస్తకాలు చదవడం వల్ల సమాజంలో జరుగుతున్న మంచి చెడు విషయాలు తెలియడం తో పాటు పరిజ్ఞానం పెరుగుతుందని జిల్లా సెక్టోరియల్ అధికారి నాగరాజశేఖర్ అన్నారు. శనివారం చండ్రుగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన చదువు ఆనందించు అభివృద్ధిచెందు అనే కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణ, సబ్ ఇన్స్ స్పెక్టర్ బి రాజేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధితో పాటు విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగించే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టిందని అందులో భాగంగా చదువు ఆనందించు అభివృద్ధి చెందు అనే కార్యక్రమాన్ని నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు దీని ద్వారా విద్యార్థులు గ్రంథాలయంలో లభించే పుస్తకాలు చదవటం వల్ల సమాజంలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థలు సామాజిక రుగ్మతలు విద్యార్థులకు స్పష్టంగా అర్థం అవుతాయి అని తెలిపారు.

విద్యార్థులతో పాటు పోటీ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ప్రభుత్వ పాఠశాలల పై ప్రత్యేక శ్రద్ధ వహించారని త్వరలోనే జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మొదటి దఫా 50 గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఒక్కొక్క గ్రంథాలయానికి రెండు లక్షల రూపాయలు నిధులు కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు పొందాలని అన్నారు.

జెడ్పిటిసి కొడకండ్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ. విద్యార్థులకు గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పుస్తకాలు చదవడం ద్వారా కవలలు, రచనలు, రాజకీయ స్థితిగతులపై పట్టు సాధిస్తారని అన్నారు. విద్యార్థులు పాఠశాల సమయానికి కంటే ముందుగా వచ్చి గ్రంథాలయంలో పుస్తకాలను చదవటం అవలంబించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మలిపెద్ది లక్ష్మి భవాని, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎంపీటీసీ దారా వెంకటేశ్వరరావు బాబు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఉండేటి ఆనంద్, సీనియర్ ఉపాధ్యాయురాలు మంజుశ్రీ, పాఠశాల పీడీ రామారావు, ఉపాధ్యాయులు ఎండి వాజిద్, రాములు, సిఆర్ పి సేవ్యా, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్