గ్రామీణ ప్రాంత యువత చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి

258చూసినవారు
గ్రామీణ ప్రాంత యువత చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి
గ్రామీణ యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించి దేశానికి, రాష్ట్రానికి, అలాగే గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, ఎంపీడీవో రేవతి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్పు టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం చండ్రుగొండ క్రీడా మైదానం ప్రాంగణంలో జరుగుతున్న కబడ్డీ, వాలీబాల్, పోటీలను మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, ఎంపీడీవో జి రేవతి, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నేడు గ్రామీణ ప్రాంతాల్లో యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా గ్రామాల్లో యువత క్రీడలపట్ల ఆసక్తి పెరిగి క్రీడాకారులుగా రాణించాలనే ఉద్దేశంతోనే క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభ కనబరచాలని కోరారు. అలాగే ఎండలను దృష్టిలో పెట్టుకొని క్రీడా ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని చల్లటి డ్రింకింగ్ వాటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి సత్తెనపల్లి సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి తోట తులసీరామ్, యు డిసి నరసింహారావు, పలు పాఠశాలల పీడీ, లు పలు పంచాయతీలా కార్యదర్శులు, ఏఎన్ఎంలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్