పారిశుద్ధ పనులు గ్రామాల్లో నిరంతరం కొనసాగించాలి

268చూసినవారు
పారిశుద్ధ పనులు గ్రామాల్లో నిరంతరం కొనసాగించాలి
గ్రామాల్లో పారిశుద్ధ పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చండ్రుగొండ, మద్దుకూరు, దామరచర్ల, గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త సేకరణ, మురుగునీరు నిలవ లేకుండా డ్రైనేజీలను శుభ్రం చేయాలని ఆదేశించారు. అలాగే ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని హరితహారం లో వేసిన అవెన్యూ ప్లాంటేషన్, పార్క్ లోని మొక్కలకు నీళ్లు పెట్టాలన్నారు. అలాగే డెంగ్యూ వ్యాధి సక్రమించకుండా దోమల వృద్ధిని తగ్గించడానికి ప్రతి శుక్రవారం ఫ్రైడే ను డ్రైడేగా నిర్వహించి నీటి తొట్టిలో ఉన్న పాత నీటిని పారబోసి కొత్తనీటిని పట్టుకోవాలన్నారు. అలాగే వాడి పడేసిన పాత టైర్లు, కొబ్బరి బోండాలను, ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి రేవతి, మండల పంచాయతీ అధికారి తోట తులసి రామ్, ఏపీఓ రామచంద్రరావు, పంచాయతీ కార్యదర్శులు కే ఉపేందర్, శంకర్, కృష్ణకుమారి, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్