ప్రభుత్వ ఆదేశాల మేరకు పదో తరగతి ఎగ్జామ్స్ లో స్వల్ప మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్థిని, విద్యార్థులకు, పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణ, చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఉండేటి ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పదో తరగతి ఎగ్జామ్ లో
విద్యార్థులు స్వల్ప మార్కులతో ఫెయిల్ అవ్వడం జరిగిందన్నారు. వారందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ నుండి జూన్ 17వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు పరీక్షల్లో అనుసరించాల్సిన మెలకువలు పై కూడా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఫెయిల్ అయిన
విద్యార్థులు నిరుత్సాహ పడకుండా ధైర్యంగా చదివి తోటి స్నేహితులతో కలిసి పై చదువులకు వెళ్లే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని, ఈ తరగతులను సద్వినియోగం చేసుకొని. సప్లమెంటరీ ఎగ్జామ్ లో రాణించాలని కోరారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి. ఈ ప్రత్యేక తరగతులకు తమ పిల్లలు వచ్చేలా తల్లిదండ్రులు సైతం కృషి చేయాలన్నారు.