ఉచిత కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి

176చూసినవారు
ఉచిత కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంగయ్య బంజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ సునీత కోరారు. గురువారం మంగయ్య బంజర గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో ఆమె పాల్గొని కంటి వెలుగు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదలు తమ వద్ద డబ్బులు లేక తమకు వచ్చిన చిన్న చిన్న కంటి సమస్యలను చూపించుకోక పోవడంతో ఎంతోమంది కంటి చూపును కోల్పోవడం జరుగుతుందని. గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన కళ్లద్దాలను ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామపంచాయతీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ కనకం తనూజా, కంటి వైద్యులు రఘునాథ్ సాయిబాబు, హెల్త్ సూపర్ వైజర్ ఇమామ్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఆప్తాల్మిక్ వెంకట సుబ్బలక్ష్మి రేఖానా, డిఇఓ నీలిమ, సిస్టర్ బి సక్కుబాయి, ఎంఎల్ హెచ్ పి ఎం డి సబియా తన్విన్, పంచాయతీ కార్యదర్శి రామిశెట్టి ప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్