ఘనంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం

176చూసినవారు
ఘనంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో మాస శివరాత్రి పురస్కరించుకొని గురువారం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు అభిషేకాలు, గోత్ర నామార్చన కార్యక్రమం, అనంతరం కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణం లో అన్నపురెడ్డిపల్లి గ్రామస్తులు వనమా గాంధీ కుటుంబ సభ్యులతో పాటు సత్తుపల్లి పట్టణానికి చెందిన పలువురు భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ పివి రమణ, సంపత్, పురోహితులు, దేవస్థానం సిబ్బంది, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్