నేటి యువత పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరిత్రను స్పూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలని సిపిఎం చండ్రుగొండ మండల కమిటీ సభ్యులు రాయి రాజా పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి పురస్కరించుకొని. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాయి రాజా మాట్లాడుతూ. దేశంలో ఆచరణ, అంకితభావం, ఉత్తమమైన కమ్యూనిస్టుగా రాజకీయ నాయకుడిగా జీవించడం అందరి వల్ల సాధ్యం కాదన్నారు. అది కొందరికే సాధ్యమని అది కూడా కమ్యూనిస్టులకే సాధ్యమవుతుందన్నారు. దానికి నిదర్శనమే పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో ఓ ధనిక కుటుంబంలో జన్మించి. పేదల బాధల సాధకాలను గ్రహించి వాటన్నిటికీ పరిష్కారం చేయాలని ఉద్దేశంతో చిన్నతనంలోనే కమ్యూనిటీ భావజాలం వైపు అడుగులు వేసి.
ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించిన మహోన్నత నేత అని కొనియాడారు. నేటి యువత కూడా ఆయన ఆశయ సాధనలో భాగస్వాములై ఆయన నేర్పిన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పార్టీ మండల కమిటీ సభ్యులు పెద్దిని వేణు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రామడుగు వెంకటాచారి, హమాలీ నాయకులు దాసరి బాబు, బేతి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.