భద్రాద్రి రామాలయంలో భక్తుల సందడి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. అర్చకులు ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన, ఆరాధన, పుణ్యవచనం, సేవాకాలం తదితర పూజలు గావించారు. భక్తులు క్యూలైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రాక సందర్భంగా రామాలయం ప్రాంగణం సందడిగా కనిపించింది.