భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు వేతనాల కోసం మూడు రోజులు నుండి సమ్మెబాట పట్టారు. మూడు రోజులకే ఆసుపత్రిలోని ప్రతి వార్డు మెడికల్ వ్యర్ధాలతో కంపు కొడుతుంది. ఇప్పటికే విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యం కోసం వస్తున్న రోగులకు ఆసుపత్రి వ్యర్ధాలతో కొత్త రోగాలు అంటుకుంటాయని ఆందోళన చెందుతున్నారు. కార్మికులు మాత్రం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు.