అర్హులైన రైతులందరికీ రుణమాఫీ: డీఏఓ
అర్హత కలిగిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 2లక్షల లోపు రుణం మాఫీ చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి డి. పుల్లయ్య తెలిపారు. కామేపల్లి మండలంలోని జాస్తిపల్లి పరిధిలో పత్తి, వరి పంటలను పరిశీలించిన ఆయన సస్యరక్షణ చర్యలపై సూచనలు చేశారు. ఆతర్వాత పొన్నేకల్ రైతు వేదికలో రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, ఏఓ తారాదేవి, ఏఈఓలు ఉష, వేదిత పాల్గొన్నారు.