గిరిజన ప్రాంతాల్లో ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్కు వచ్చిన ఆయన ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో వంద శాతం ఓటర్ల వివరాలు నమోదు చేయాలని సూచించారు. దివ్యాంగులు, ట్రాన్సోజెండర్లకు ఓటు దరఖాస్తుపై అవగాహన కల్పించాలన్నారు.