ఫీజ్ రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని, నూతన జాతీయ విద్యావిధానం రాష్ట్రంలో అమలు చేయకూడదని జూనియర్ కళశాలలో మధ్యాన్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ల సాధన కొరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కొత్తగూడెం కలెక్టరేట్ ను బుధవారం ముట్టడించారు. గత ప్రభుత్వంలో ఫీజ్ రియంబర్స్ మెంట్ నిధులు, స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాం అని అన్నారు.