రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం అభినందనలు తెలిపారు. ఆటల్లో గెలుపోటములు సహజమని స్పోర్టివ్ గా తీసుకోవాలన్నారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తేవాలన్నారు.