అశ్వాపురంలో పోలీసులు శుక్రవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా తురమలగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు 10 లీటర్ల గుడుంబాతో పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి గుడుంబాను స్వాధీనం చేసుకుని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అశ్వాపురం సీఐ జి. అశోక్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.