ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరులో మంగళవారం 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దొడ్డి భద్రయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత సమగ్రతకు పెద్ద పీట వేస్తుందన్నారు,