ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో సీపీఎం పార్టీ బూర్గంపహాడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సమస్యలతో వినతి పత్రం అందజేయడం జరిగింది. తాళ్ళగోమ్మూరు ఫంక్షన్ హాల్ లో బుధవారం సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, సుందరయ్య నగర్ సమస్యలతో పాటు మండలంలో ఉన్న స్థానిక సమస్యలను కూడా పరిష్కారం చేయాలని అన్నారు.