ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మిపురం గ్రామంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గొంది సాంబిరెడ్డి గృహంలో రూ. 80 వేల ఖర్చుతో నూతనంగా నిర్మిస్తున్న గేదెల షెడ్డు కి మంగళవారం శంకుస్థాపన చేశారు.