జామాయిల్ కర్ర లారీని ఢీకొన్న టిప్పర్

1859చూసినవారు
బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సారపాక ఐటీసీ కర్మాగారానికి జామాయిల్ కర్ర తీసుకెళ్తున్న లారీని టిప్పర్ వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవరుకు గాయాలైయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు 108 ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్