మణుగూరు మండలం చిక్కుడుగుంటలో శుక్రవారం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం శంకుస్థాపన చేశారు. సుమారు 90 లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నట్లు ఆయన అన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే సూచించారు.