మణుగూరు గుట్ట మల్లారం రైతు వేదికలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైతు పండుగ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.