మణుగూరు: ఎస్సీ వసతిగృహం ఎదుట కార్మికుల నిరసన

73చూసినవారు
మణుగూరు: ఎస్సీ వసతిగృహం ఎదుట కార్మికుల నిరసన
మణుగూరు అశోక్నగర్లోని ఎస్సీ బాలుర వసతిగృహం ఎదుట మంగళవారం అందులో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది నిరసన చేపట్టారు. వార్డెన్ శ్రీనివాస్ తమపై కక్ష్యపూరితంగా నిందలు వేస్తూ తీవ్రస్థాయిలో వేధిస్తున్నాడన్నారు. వంటకు అవసరమైన నిత్యావసరాలకు తమనే డబ్బులు ఖర్చు చేయమంటున్నాడని, ఉద్యోగంతో సంబంధం లేకుండా అన్ని పనులు చేయిస్తూ, ఇదేంటని అడిగితే ఎవ్వరూ ఉద్యోగాలకు రావొద్దంటూ దౌర్జన్యం చేస్తున్నాడన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్