పినపాక మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన కొమరం సమ్మక్క ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. అధైర్య పడొద్దు అండగా ఉంటానని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.