పినపాక మండలం ఈ బయ్యారం రేంజ్, జానంపేట రిజర్వ్ ఫారెస్ట్, 36వ కంపార్ట్మెంట్లో పెద్దపులి సంరక్షణ కోసం, పగలు, రేయి అనే వ్యత్యాసం లేకుండా మణుగూరు డివిజన్ ఎఫ్డిఓ సయ్యద్ మసూద్ మోహిద్దీన్, సిబ్బంది సోమవారం పహారా కాస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరకగూడెం మండలంలో కౌలూరు, ముసలమ్మ గుట్ట ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని వెల్లడించారు.