బూర్గంపాడు మండలం సారపాకలో రేపు విద్యుత్‌కు అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ ఏఈ జి జితేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సారపాక 33కెవి/ 11కెవి సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ లో భాగంగా ఉదయం 08-00 గంటల నుండి ఉదయం 09-00 గంటల విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.