మణుగూరు రాజీవ్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని తహశీల్దార్ రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కుమార్ మహేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్కు కేటాయించిన భూమి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్మాణ పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.