కరకగూడెం మండల పరిధిలోని భట్టుపల్లి కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్ టీయూ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం కేజీబీవీ పాఠశాలలోనాన్ టీచింగ్ వర్కర్లకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ కేజీబీవీలో సుమారు ఏడు వేలకు పైగా నాన్ టీచింగ్ వర్కర్లు పని చేస్తున్నారని, వారికి కనీస వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.