బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న టిపిసిసి సభ్యులు నాగాసీతారాములు...
కొత్తగూడెం నియోజకవర్గం, సుజాత నగర్ మండలం, నాయకులగూడెం అభయాంజనేయ స్వామి ఆలయం లో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. మహిళలతో బతుకమ్మను ఆడి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలను బతుకమ్మ పండుగ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉందని, అమ్మ వారి ఆశీర్వాదంతో అందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్టఐశ్వర్యాలుతో, తులనాడాలని అమ్మవారిని వేడుకున్నారు . బతుకమ్మ కమిటీ సభ్యులను ఆయన అబినందించారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, మండల BC నాయకులు బాలు, బద్దర్రావు,చినభద్రం, యువజన కాంగ్రెస్ నాయకులు సురేష్ గుప్తా,గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.