ఇల్లందు: సమస్యలు పరిష్కరించాలని చైర్మన్ కమిషనర్ కు వినతి

62చూసినవారు
ఇల్లందు: సమస్యలు పరిష్కరించాలని చైర్మన్ కమిషనర్ కు వినతి
ఇల్లందు పట్టణంలోని 20వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం వార్డు కౌన్సిలర్ మొగిలి లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు కమిషనర్ శ్రీకాంత్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ. 20వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. సిసి రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం తదితర సమస్యలను విన్నవించినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్