మండల స్థాయి టాలెంట్ టెస్ట్లో టేకులపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఒలంపియాడ్లో తేజస్వి ప్రథమ స్థానం, వకృత్వ పోటీలలో మొదటి స్థానం నజీబా, హర్షిత ద్వితీయ బహుమతి సాధించారని తెలిపారు. బహుమతులు సాధించిన విద్యార్థులను ఇంగ్లీష్ టీచర్ రవీందర్, శేషగిరి, ప్రవీణ్, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.