ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి

84చూసినవారు
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి
ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టియు) జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇల్లందు మండలం కొమరారం గ్రామపంచాయతీలోని ఉపాధి హామీ కూలీలతో క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన గ్రూప్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్