హీరోయిన్ కృతి సనన్ హిందీ, తెలుగు ప్రేక్షకులకు సూపరిచితమే. అయితే కృతికి సంబంధించి ఓ వార్తా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె బిజినెస్‌మెన్ కబీర్ బహియాతో డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరూ గ్రీస్ లో ఒకే ఈవెంట్లో కనిపించారు. ఈవెంట్ కు సంబంధించిన ఓ ఫొటోను కబీర్ సోషల్ మీడియాలో లొకేషన్ తో సహా పోస్ట్ చేశారు. అదే లొకేషన్ లో కృతి ఉన్నట్లు తేలింది. దుబాయ్ లో 2024 న్యూ ఇయర్ వేడుకల్లోనూ వీరిద్దరూ కలిసి కెమెరాకు చిక్కారు.