TG: కరీంనగర్ మేయర్ సునీల్‌రావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ మారవద్దని సునీల్‌రావుకు కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. సునీల్‌రావు రేపు బీజేపీలో చేరనున్న సమయంలో కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి ఆపే ప్రయత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేయర్ సునీల్‌రావు 10 మంది కార్పొరేటర్లతో బీజేపీలో చేరనున్నారు. ఈ విషయమై కార్పొరేటర్లతో ఎమ్మెల్యే గంగుల సమావేశమైనట్లు తెలుస్తోంది.