ఈడీ కేసులో KTR.. అదే జరిగితే BRS పగ్గాలు ఎవరికి?

75చూసినవారు
ఈడీ కేసులో KTR.. అదే జరిగితే BRS పగ్గాలు ఎవరికి?
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే జనవరి 7న విచారణకు రావాలని కోరింది. మరోవైపు ఈ కేసులో ఏసీబీ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒకవేళ ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటే.. బీఆర్ఎస్‌ను ఎమ్మెల్సీ కవిత లీడ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మద్యం పాలసీ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నా.. ప్రస్తుతం జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్