ఫార్ములా-ఈ రేసు కేసుపై KTRను ప్రధానంగా నగదు బదిలీపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. HMDA ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధుల బదలాయింపు, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ ముగిసిందని BRS నేతలు బాల్క సుమన్, RSP సహ కార్యకర్తలు ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో KTR ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వస్తారా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది.