అవయవదానాన్ని ప్రోత్సహించాలని ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. అవయవదానానికి ఎమ్మెల్యేలు ప్రతిజ్ఞ చేసి, తమ నియోజకవర్గాల్లో అవయవదానాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇందులో భాగంగా తానే మొదటిగా అవయవదానం పత్రంపై సంతకం చేస్తానని వెల్లడించారు.