AP: కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులో అపశృతి.. అభ్యర్థి మృతి

65చూసినవారు
AP: కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులో అపశృతి.. అభ్యర్థి మృతి
ఏపీలో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టు నిర్వహణలో అపశృతి చోటు చేసుకుంది. విశాఖ ఏఆర్ గ్రౌండ్స్‌లో కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియ గురువారం జరిగింది. 1,600 మీటర్ల రన్నింగ్ అనంతరం అభ్యర్థి శ్రావణ్ కుమార్ సొమ్మసిల్లి పడిపోయాడు. నిర్వాహక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పుట్టినరోజు నాడే శ్రావణ్ కుమార్ మృతి చెందటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్